ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజినీకాంత్ ను కలసిన మనోబాల, విశాల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 12:40 PM

తమిళనాడు నడిగర్ సంఘం అధ్యక్షుడు, నిర్మాత, హీరో విశాల్ ఈరోజు ఉదయం రజినీకాంత్ ను కలిశారు.  మరో నటుడు మనోబాలతో కలిసి రజినీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఇళయరాజా 75 మ్యూజికల్ కార్యక్రమానికి రజినీకాంత్ ను ఆహ్వానించారు.  అదే విధంగా పెట్ట మంచి విజయం సాధించడంతో.. ఈ ఇరువురు నటులు రజినీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇళయరాజాకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇళయరాజా 75 అనే కార్యక్రమాన్ని నడిగర్ సంఘం అధికారికంగా నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమానికి తమిళ ప్రముఖులందరిని ఆహ్వానిస్తోంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa