రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా. రంజిత్ దర్శకుడు. ఇందులో రజనీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ ఈ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తొలి చిత్రంతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా హ్యుమా ఖురేషీ అన్నారు.
‘ఆయన (రజనీకాంత్)తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు చివరి షెడ్యూల్ జరుగుతోంది. చిత్రం బాగా రావాలని టీం మొత్తం కష్టపడి పనిచేస్తోంది. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. కథ విన్నప్పుడే నటించాలని నిర్ణయించుకున్నా, నటిస్తున్నా. రజనీతో కలిసి పనిచేయడం ఓ కల. అది ఈ సినిమాతో నిజమైంది. జీవితంలో ఇలాంటి అవకాశాలు కొన్ని సార్లే వస్తాయి. వాటిని కాదనకుండా అందిపుచ్చుకోవాలి’ అని ఆమె చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa