14 ఏళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినట్టు టాలీవుడ్ నటి భానుప్రియపై నమోదైన కేసులో ట్విస్ట్. భానుప్రియ ఇంట్లో దొంగతనం చేసింది నిజమేనని, తనను చూడడానికి వచ్చిన తల్లికి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, ఖరీదైన వస్తువులు ఇచ్చి పంపించేదాననని అని మీడియా ముందు ఒప్పుకుంది పనిపిల్ల సంధ్య. అలా దొంగిలించిన విషయం భానుప్రియకి తెలిసి... తిరిగి ఇచ్చేయాలని అడగడంతో తన తల్లి కేసు పెట్టినట్టు మీడియాతో చెప్పింది. లక్షలు ఖరీదైన వాచ్‌లతో పాటు ఐపాడ్, ఐ ఫోన్, బంగారు నగలు తల్లికి పంపించినట్టు మీడియాకు తెలిపింది సంధ్య. మీడియాలో తనపై ఆరోపణలు రావడంతో వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చింది భానుప్రియ. ‘సంధ్యను నిర్భందించినట్టు ఆరోపిస్తున్న ప్రభావతి... వచ్చి తన నగలు తనకు ఇచ్చి కూతుర్ని ఇప్పుడే తీసుకుపోవచ్చు’ అంటూ తెలిపింది. నగలు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై తప్పుడు కేసు పెట్టిందని వివరించింది.
‘ఛత్రపతి’ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తల్లిగా అద్భుతంగా నటించి, మాతృత్వంలోని మాధుర్యాన్ని రుచి చూపించింది సీనియర్ నటి భానుప్రియ. అంతకు ముందు ఎన్నో చిత్రాల్లో సున్నితమైన పాత్రల్లో ఎంతో అద్భుతమైన అభినయం ప్రదర్శించింది భానుప్రియ. అయితే నిజజీవితంలో మాత్రం ఆమెపై వేధింపుల కేసు నమోదైంది. నవ్యాంధ్ర తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సామర్లకోట పోలీసులకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. భానుప్రియ ఇంట్లో పని చేసేందుకు 14 ఏళ్ల బాలికను తీసుకెళ్లింది ప్రభావతి. పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి... తన కూతురు సంధ్యను భానుప్రియ ఇంట్లో పనికి పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో మానేసిన సంధ్య... కుటుంబ పరిస్థితుల కారణంగా పనిచేసేందుకు అంగీకరించింది. అయితే పనికి కుదిర్చిన తర్వాత ఏడాది పాటు కనీసం కూతురితో మాట్లాడడానికి కూడా భానుప్రియ ఒప్పుకోలేదని ఆమె తల్లి ప్రభావతి ఆరోపించింది. అంతేకాకుండా కొన్నాళ్లకు సంధ్యను భానుప్రియ బంధువులు చెన్నైకి తీసుకెళ్లారని, అక్కడ ఇంట్లో పని పెట్టారని పేర్కొంది. ఏడాది కాలంగా కూతురుని కలవనివ్వకుండా, ఒక్క రోజు కూడా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారి ఆరోపించిందామె. ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని... అమ్మతో మాట్లాడతానని సంధ్య అడిగితే దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా భానుప్రియ కుమారుడు సంధ్యను కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని, ఆ విషయం ఎక్కడ తల్లికి చెప్పేస్తుందేమోనని భయంతో తనతో మాట్లాడనివ్వడం లేదని తన ఫిర్యాదులో పేర్కొంది ప్రభావతి. చైల్డ్ హెల్ప్‌లైన్ సాయంతో ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 16 నెలలుగా సంధ్య, భానుప్రియ ఇంట్లో పనిచేస్తోందని... జీతం ఇవ్వకుండా, కూతురిని చూపించకుండా వేధిస్తోందని ఆరోపించింది ప్రభావతి. చిన్నపిల్లలతో పని చేయించుకోవడం నేరమని తెలిసినా భానుప్రియ ఎందుకు సంధ్యను పెట్టుకుందని... వీటితో పాటు ఆమెపై, కొడుకుపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ మొదలెట్టినట్టు తెలిపారు సామర్లకోట పోలీసులు. అసలు విషయం తెలియాలంటే పోలీస్ విచారణ పూర్తయ్యేదాకా వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa