ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు వందల కోట్ల క్లబ్‌లో ‘యూరీ’

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 09, 2019, 02:24 PM

పాకిస్థాన్‌కు ధీటైన సమాధానం చెప్పి.. ఇండియన్‌ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది సర్జికల్‌ స్ట్రైక్‌. భారత ఆర్మీ విజయవంతంగా చేపట్టిన ఈ చర్య ఆధారంగా.. యూరీ ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.


విడుదలై నాలుగు వారాలు అవుతున్నా.. వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికి ఈ చిత్రం రెండు వందల కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని వీక్షించిన యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. దేశ భక్తిని పెంపొందించేలా తెరకెక్కిన ఈ చిత్రానికి పలు రాష్ట్రాలు జీఎస్టీ నుంచి మినహాయింపును ఇచ్చాయి. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa