సహజమైన నటనతో పక్కింటి కుర్రాడిలా ఉండే సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నాని. అందుకే అతన్ని ముద్దుగా నేచురల్ స్టార్ అని అభిమానులు పిలుచుకుంటారు. నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో 'అష్టాచమ్మా' .. 'జెంటిల్ మేన్' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు పరిచాయి. ఇప్పుడ్డు మల్లి వీళ్లిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.
ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ .. సుధీర్ బాబుకి కూడా 'సమ్మోహనం' వంటి హిట్ ఇచ్చాడు. నాని - సుధీర్ బాబు కాంబినేషన్లోని సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ప్రస్తుతం మిగతా నటీనటులను ఎంపిక చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.