ప్రముఖ సినీ ఆర్టిస్టులు, యాంకర్లు అనసూయ, రష్మీ బీచ్ లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోను అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ‘శక్తిమంతమైన మహిళలను గుర్తించడం చాలా తేలిక.. ఉన్నతస్థితికి చేరేందుకు అలాంటివారు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. అంతేకానీ, ఒకరినొకరు అణగదొక్కేందుకు యత్నించరు’ అని ఆ ట్వీట్ లో అనసూయ పేర్కొంది.
అభిమానులతో పంచుకున్న ఈ ఫొటోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీరు కూర్చున్న ప్లేసే కాదు, మీరు కూడా అందంగా ఉన్నారు’, ‘ఒకే చోట ఇద్దరు అందమైన అతివలు’, ‘మీ ఇద్దరి స్నేహం బాగుంది’, ‘రెక్కలు లేని దేవతలు’, ‘సూపర్బ్’, ‘ఆసమ్’ అంటూ ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa