హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ -11 లో కాంటెస్టెంట్ ఉంటున్న బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ ఓ సందర్భంలో దక్షిణాది నటీమణుల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దక్షిణాది భామలు ఎక్స్ పోజింగ్ చేస్తున్నారంటూ ఓ ఓ హాట్ కామెంట్ కొట్టింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ క్రమంలో దక్షిణాది హీరోయిన్ హన్సిక కూడా హీనాఖాన్ పై మండిపడింది. హన్సిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీనాఖాన్ కు రిప్లయ్ ఇచ్చింది. ” చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఇక్కడ పనిచేశారు, చేస్తున్నారన్న విషయం ఆమెకు తెలియదా? మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన హీనాఖాన్ సిగ్గుపడాలి. ఓ దక్షిణాది నటిగా.. ఈ చిత్ర పరిశ్రమకు చెందిన నటిని అని చెప్పుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నా. హీనాఖాన్ చెప్పిన మాటలన్నీ చెత్తమాటలు” అని స్ట్రాంగ్ గా చెప్పింది హన్సిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa