నటి హన్సిక 50వ చిత్రంగా జమీల్ దర్శకత్వంలో ‘మహా’ రూపొందుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో నటుడు శింబు కనిపించనున్నట్టు సమాచారం. ఆయన పేరును హన్సికనే సూచించిందనీ, ఆమె రిక్వెస్ట్ చేయడం వల్లనే శింబు ఓకే అన్నాడని దర్శకుడే స్వయంగా చెప్పాడు. ఈ సినిమాతో తాము మళ్లీ కలిసిపోయినట్టుగా హన్సిక కూడా స్పందించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. విడిపోయిన జంట .. కలిసి తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa