ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవీన్ జీవితంలో మరిచిపోలేని సంఘటన ఇదేనట!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 05:09 PM

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన నటుల్లో 'గెడ్డం నవీన్' ఒకరు. తనదైన నటనతో నవ్వులు పూయించే నవీన్, ఇప్పుడిప్పుడే సినిమాల్లోను అవకాశాలు సంపాదించుకుంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

'వెంకీమామ' సినిమాలో నేను ఒక చిన్న పాత్రను చేశాను. వెంకటేశ్ గారు నన్ను చూడగానే దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకున్నారు. 'నేను మీ ఫ్యాన్ ని నవీన్' అన్నారు. దాంతో నేను 'అయ్యో అదేంటి సార్ .. నేనే మీ అభిమానిని. 'కలియుగ పాండవులు' దగ్గర నుంచి మీ సినిమాలు అన్నీ చూస్తూ వస్తున్నాను' అన్నాను. ఆ మాటకి వెంకటేశ్ గారు నవ్వుతూ నన్ను రావు రమేశ్ దగ్గరికి తీసుకెళ్లారు. 'గుర్తుపట్టారా .. నవీన్ .. జబర్దస్త్ లో సూపర్ గా చేస్తాడు' అని చెప్పారు. నా గురించి వెంకటేశ్ గారు అలా చెబుతుండటాన్ని చూసి నా కళ్లను నేను నమ్మలేకపోయాను. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది" అని చెప్పుకొచ్చాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa