సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితారకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకపోయినా ఆమె ఇప్పటికే యాడ్స్ లో నటించింది. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నారు. నమ్రత, సితార ఈ మధ్య బయట ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా తాను బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న పీఎంజే జ్యువెలర్స్ 40వ షోరూమ్ ప్రారంభోత్సవంలో సితార, నమ్రత సందడి చేశారు. పంజాగుట్టలో ఈ షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో ముచ్చటించారు.మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై మీడియా అడిగిన ప్రశ్నకు సితార సమాధానమిస్తూ... ఈ సినిమాలో నాన్న లుక్ అదిరిపోతుందని చెప్పింది. అందరూ ఊహించిన దానికంటే ఈ సినిమా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ సినిమా గురించి ఇంతకంటే తాను ఎక్కువ మాట్లాడలేనని చెప్పింది. మహేశ్ బాబు ఎప్పుడైనా గిఫ్టులు ఇచ్చారా? అనే ప్రశ్నకు నమ్రత సమాధానమిస్తూ... మహేశ్ కు గిఫ్టులు ఇచ్చే అలవాటు లేదని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని నవ్వుతూ అన్నారు.
![]() |
![]() |