టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంకర్ ఈ మధ్య తీసిన రెండు సినిమాలు పరాజయం పొందినప్పటికీ... ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. తాను, తన భార్య స్నిగ్ధ... పిల్లలు వద్దనుకున్నామని హరీశ్ శంకర్ తెలిపారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని... తన చెల్లెలికి పెళ్లి చేయాలి, తమ్ముడిని సెటిల్ చేయాలి వంటి ఎన్నో బాధ్యతలు ఉండేవని చెప్పారు. ఈ బాధ్యతను నెరవేర్చడంలో తన భార్య తనకు ఎంతో సహకారం అందించిందని తెలిపారు. వీటితోనే తాను పూర్తిగా అలిసిపోయానని... మళ్లీ అలాంటి బాధ్యతలు వద్దనుకున్నామని తెలిపారు. పిల్లలు ఉంటే స్వార్థంగా తయారవుతామని... అన్నిటికీ అడ్జస్ట్ అయి బతకాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే తాము పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు.
![]() |
![]() |