బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌషల్ యొక్క బ్లాక్ బస్టర్ హిస్టారికల్ డ్రామా 'చవా' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తన శక్తిని చూపిస్తూనే ఉంది. పురాణ మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పై ఈ ప్రశంసలు పొందిన బయోపిక్ ఇప్పటికే దేశీయ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డు ని అధిగమించింది. ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్పందనను అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చవాలో అక్షయ్ ఖన్నా, రష్మికా మాండన్న ప్రధాన పాత్రల్లో ఉన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా మరియు నీల్ భూపాలం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత స్వరకర్త ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని కంపోజ్ చేశారు. లక్స్మాన్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దినేష్ విజయన్ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు.
![]() |
![]() |