by Suryaa Desk | Tue, Jan 14, 2025, 10:48 AM
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాజాసాబ్' ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా హార్రర్ కామెడీ జోనర్‌లో మన ముందుకు త్వరలో రానుంది. సంక్రాంతి సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 10న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇక, ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ ను జపాన్‌లో చేయబోతున్నారంటూ తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో జపనీస్ వెర్షన్‌లో ఓ పాట చేయాలని మూవీ మేకర్స్ తనను కోరినట్లు తెలిపాడు. సంక్రాంతికి రిలీజ్ చేసిన పోస్టర్ లో కళ్లద్దాలు పెట్టుకుని నవ్వుతున్న ప్రభాస్ ఫోటోను చూసి డార్లింగ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక నెటిజన్స్ అచ్చం పెళ్ళి కొడుకులా రెడీ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరికి సంక్రాంతి విషెస్ తెలుపుతూ " మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ .. త్వరలో చితక్కొట్టేద్దాం " అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం, ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.