by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:58 PM
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ ప్రమోషన్స్ ఫలించినట్లే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ మూవీకే ఎక్కువగా టికెట్లు బుక్ అవుతున్నట్లు సమాచారం. కేవలం బుక్ మై షోలోనే లక్ష టికెట్లు ముందుగానే బుక్ అయినట్లు ఆ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ కూడా ఓ పోస్టర్ విడుదల చేసింది.అందుకు తగ్గట్టుగానే మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆడియన్స్కి దగ్గరయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన రీల్స్, ఈవెంట్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి. దీంతో సంక్రాంతి సరైన విన్నర్ వెంకీ మామ.. అనేలా జోరు కొనసాగుతుంది.
Latest News