by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:14 PM
కంగువ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నటుడు సూర్య. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకు అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు సూర్య. ఆయన నటిస్తున్న చిత్రాలలో కార్తిక్ సుబ్బరాజ్ రెట్రో, అలాగే ఆర్జే బాలాజీ చిత్రాలతో పాటు వెట్రిమారన్ వాడివాసల్ ఉంది. ఇందులో రెట్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. సూర్య కెరీర్‌లో 45 సినిమాగా వస్తున్న ఆర్జే బాలజీ చిత్రం అటు మైథాలాజీతో పాటు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా వెట్రి మారన్ దర్శకత్వంలో వస్తున్న వాడివాసల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.జల్లికట్లు నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు.
Latest News