by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:09 PM
తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్’. గట్టి పోటీ మధ్య గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ విడుదలై నేటికీ ఏడాదైన సందర్భంగా ప్రశాంత్ వర్మ తాజాగా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. హనుమంతుడి గదను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.‘‘హను-మాన్’పై మీరు చూపించిన అశేష ప్రేమాభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్నా. మన ఇతిహాస కథకు సూపర్‌హీరో హంగులు జోడించి మా విజన్‌ను మీ ముందుకు తీసుకువచ్చి నేటితో ఏడాది అవుతోంది. ఆ చిత్రానికి మీరు అందించిన సపోర్ట్ నాకెంతో విలువైనది. ఈ మేజిక్‌ను క్రియేట్ చేయడంలో భాగమైన నటీనటులు, నిర్మాతలకు నా ధన్యవాదాలు. విజయాన్ని మించి అభిరుచి, ఆశీస్సులు ఉంటే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు అనే ఒక గట్టి నమ్మకాన్ని ఈ సినిమా నాకు అందించింది. మీరు నాపై ఉంచిన నమ్మకానికి, నాకు ఎంతగానో మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.‘హను-మాన్’కు కొనసాగింపుగా రానుందే ‘జై హనుమాన్’. కన్నడ నటుడు రిషభ్ శెట్టి ఇందులో హనుమాన్ పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే ఆయన అభిమానులతో పంచుకున్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ సీక్వెల్లో కీలకాంశం. ‘హనుమాన్’లో హనుమంతుగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమే.
Latest News