by Suryaa Desk | Sun, Jan 12, 2025, 04:19 PM
తన అందంతో అందరికీ అసూయ పుట్టించే ముద్దుగుమ్మ అనసూయ. గత కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ తన నటన, మాటలతో అందరినీ అలరిస్తూ వస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, తర్వాత ల్లో అవకాశం దక్కించుకుంది.ముఖ్యంగా రంగస్థలం లో అనసూయ రంగమ్మత్తగా చేసిన పాత్ర తనకు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో వరసగా ఆఫర్స్ రావడంతో, యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి లపైనే ఫోకస్ చేసింది.పుష్ప లో దాక్షాయణిగా తన నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప2 లో కూడా ఈ అమ్మడు తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.ఇక ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ, ఎప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతి పండగకు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇందులో అనసూయ మేకప్ లేకుండా కనిపించింది.దీంతో మేకప్ లేకుండా ఉన్న అనసూయ ఫోటోస్ చూసి, అభిమానులు షాక్ అవుతున్నారు. వామ్మో ఈ బ్యూటీ అనసూయనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మకర సంక్రాంతి పండుగ సందర్భంగా అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపినక్షణాలను తన ఇన్ స్టాలో పోస్టు చేయడంతో అవి క్షణంలో వైరల్ అవుతున్నాయి.
Latest News