by Suryaa Desk | Mon, Jan 13, 2025, 11:00 AM
"గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది".. కేజీఎఫ్ సినిమాలో ఈ డైలాగ్ హీరో అజిత్ కుమార్‌కి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల దుబాయ్‌లో కారు రేసింగ్ ప్రాక్టీస్‌లో అజిత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఫ్యాన్స్ అయితే అజిత్ సార్ ప్లీజ్ మాకోసం అయినా జాగ్రత్తగా ఉండండి.. ఆ రేసింగ్ ఆపేయండి అంటూ రిక్వెస్ట్‌లు కూడా చేశారు. కానీ అజిత్ మాత్రం ఎప్పటిలానే తన రూటులో దూసకుపోయారు. ఇప్పుడు ఆ ధైర్యమే ఆయన్ని మరో మెట్టు ఎక్కించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన '24హెచ్ దుబాయ్' కారు రేసింగ్‌లో అజిత్ గెలిచారు.'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవలే అజిత్ తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. ఈ టీమ్‌తోనే దుబాయ్‌లో జరిగిన రేసింగ్ పోటీలో పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ కుమార్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇటీవల యాక్సిడెంట్ జరిగినా సరే కోలుకొని ఈ రేసులో పాల్గొన్నందుకు 'స్పిరిట్ ఆఫ్ రేస్' అనే అవార్డును అజిత్‌కి తన టీమ్ బహుకరించింది. ఇక రేస్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరిస్తుండగా అజిత్ భారత జెండాని చేతిలో పట్టుకొని తన ఫ్యాన్స్‌కి అభివాదం చేశారు. ఆ సమయంలో అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News