by Suryaa Desk | Mon, Jan 13, 2025, 02:43 PM
హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఆ మూవీ యూనిట్ ఆదివారం రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి బాలకృష్ణతో పాటు ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, హీరోయిన్లు, పలువురు హీరోలు హాజరై సందడి చేశారు.డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వక్సేన్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టి.. అందర్నీ హుషారుపరిచారు. ఈ ఇద్దరు హీరోలు కూడా బాలకృష్ణపై తమకున్న అభిమానాన్ని చూపించారు. ఈ ముద్దుల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నా సక్సెసే మీ సక్సెస్ అని, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ అని డాకు మహారాజ్ పేర్కొన్నారు.ఇక ఊర్వశి రౌతేలాతో బాలయ్య మళ్లీ స్టెప్పులేశారు. దబిడి దిబిడి పాటకు డ్యాన్స్ చేస్తూ ఊర్వశితో ఊగిపోయారు బాలయ్య. బాలయ్య స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశి అటు నుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.దబిడి దిబిడి పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.