by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:59 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆదివారం విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.అయితే డాకు మహారాజ్ సినిమా చూసి పలువురు అభిమానులు బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు.బాలయ్య యాక్షన్ కి థమన్ మ్యూజిక్ కి తోడై సినిమా అదిరిపోయిందని సినీ లవర్స్ అంటున్నారు.ఈ నేపథ్యంలో డాకుమహారాజ్ సినిమా చూసి బయటికి వచ్చిన అభిమానులు బాలయ్యతో ఫోన్ లో మాట్లాడారు. ఇక ఆదివారం రోజున సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా దబిడి దిబిడి అంటూ ఊర్వశితో నందమూరి బాలయ్య చిందులు వేశారు. ఈ వీడియోను ఊర్వశి షేర్ చేసింది. అయితే… బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా ఒక్క రోజులో అంటే మొదటి రోజున 56 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
Latest News