|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 10:34 AM
ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య. "వెల్‌విషర్స్" పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూసైడ్ నోట్ పంపి.. రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డ కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో నివసిస్తూ, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కటారి సందీప్ కుమార్(25) అనే వ్యక్తి. గత కొంత కాలంగా ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసగా మారి, లక్షల రూపాయల్లో అప్పు చేసి, తీర్చలేక మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సందీప్ కుమార్ . చనిపోయేముందు వెల్‌విషర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ చేసి, మా అమ్మ, చెల్లిని ఎవరూ ఏమీ అనకండి, నేను ఉన్నప్పుడు వాళ్లను టార్చర్ పెట్టాను.. సారీ అమ్మ, చెల్లి అని సూసైడ్ నోట్ పంపిన కానిస్టేబుల్. కేసు నమోదు చేసి, సందీప్ ఆత్మహత్యకు పాల్పడిన రివాల్వర్ ఎక్కడి నుండి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు