|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:43 PM
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. వీబీజీ రాంజీ, విత్తన చట్టం రద్దుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. మెదక్ టౌన్లో సీఐటీయూ, ఏఐఏడబ్ల్యుయూ, ఏఐకేఎస్, ఎన్పీఆర్డీ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వృత్తిదారుల సమన్వయ కమిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం 4 లేబర్ కోడ్స్‌గా తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.