|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:30 AM
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో శ్రీశైలం హైవేపై పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ (24) తన వాహనంతో మురమురా లోడుతో వెళ్తుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వస్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్ పోలీసులకు సమాచారం అందించి, మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.