|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 03:51 PM
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం, 44వ జాతీయ రహదారి శాఖా పూర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడ్డాకుల ఎస్సై ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాల పట్ల వాహనదారులు, ప్రయాణికులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టును పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.