|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 03:49 PM
మిర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పురాలో ఒక ఫ్లాట్లో ఇద్దరు వృద్ధులు, మొహమ్మద్ షకీల్, అతని సోదరి సర్వర్ బేగం మృతి చెందారు. 40 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న వీరిద్దరూ అవివాహితులు. దివ్యాంగురాలైన సర్వర్ బేగమ్ ను అన్న షకీల్ చూసుకునేవాడని సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఇది సహజ మరణమా లేక ఆత్మహత్యలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మిర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.