|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:15 PM
అచ్చంపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో వలపట్ల గ్రామచెరువు నుండి నీటిని బయటికి పంపేందుకు రూ. 1.75 లక్షల కేంద్ర నిధులతో చేపట్టిన పైపులైను అభివృద్ధి పనులను లింగోటం గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువు శనిగకుంట నీటితోపాటు, డ్రైనేజీ, బోరు నీళ్లు తమ పొలాల్లోకి, చెరువులోకి వస్తున్నాయని, కలుషిత నీటితో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని లింగోటం యువకులు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం ఇరు గ్రామాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తోపులాటలో కౌన్సిలర్ బీసీ మల్ల ఆనంద్ స్వల్పంగా గాయపడ్డారు. అలాగే కౌన్సిలర్ అంతటి శివ, మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త అంతటి మల్లేష్లను తోశారు.