|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:44 PM
కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల జోరుకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా తులం బంగారంపై సుమారు రూ.8,000 వరకు తగ్గగా, కిలో వెండిపై రూ.15,000 మేర తగ్గుదల కనిపించింది.గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ.7,550 తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.4,15,000గా ఉంది.