|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 12:12 PM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు ఊపందుకున్నాయి. నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మొహమ్మద్ నిజాం, మొహమ్మద్ అజారుద్దీన్, షేక్ ఫిరోజ్, రాథోడ్ అంబాజీ, అబ్దుల్ షైజ్ లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.