|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:45 PM
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాయికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2023లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందాలని మహేంద్ర బాబు మొక్కుకోగా, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.