|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 01:42 PM
డిజిటల్ యుగంలోనూ చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. ఇకపై ఏటీఎంల నుంచి కేవలం పెద్ద నోట్లే కాకుండా, రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ చిన్న కరెన్సీ నోట్లను సులభంగా పొందేలా ఏటీఎంలను రీడిజైన్ చేయనున్నారు. ముంబైలో ఈ ప్రణాళికను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.