|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:20 AM
TG: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్(D) పర్వతగిరి(M) సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. అనిత దూరపు బంధువు రాజేందర్ తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటుందని, తెలుసుకుని అనిత గురించి తప్పుడు సమాచారచ్చాడు. దీంతో అతను కూడా అనితను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన అనిత గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకుంది. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.