బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని మంగళవారం ఆర్డిఓ రమేష్ రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న భోజనం పట్ల అశ్రద్ధ వహించరాదని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఖలీల్ అహ్మద్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa