తెలంగాణలో టీ లవర్స్‌కి కొదవే ఉండదు. టీ అంటే ఒక అలవాటో.. ఒక వ్యసనమో కాదు.. అదోక సంప్రదాయం. కొందరికైతే.. టీ తాగాకే రోజు మొదలవుతుంది.. టీ తాగిన తర్వాతే రోజు పూర్తవుతుంది. కార్మికుడి నుంచి కార్పోరేట్ ఆఫీసులు ఉద్యోగి వరకు చాలా మందికి తెలియకుండానే చాయ్ అనేది ఒక ఎమోషన్. అలాంటి టీ ప్రేమికులు కూడా చాయ్ తాగలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే.. ఛాయ్‌లో ఉపయోగించే టీ పొడిని భట్టి.. దాని రుచి మారుతుంది. మార్కెట్‌లో ఎన్నో రకాల టీ పొడులు అందుబాటులో ఉండగా.. కొంతమంది ప్రత్యేకంగా తయారు చేసిన చాయ్‌పత్తా రకాలను వాడుతుంటారు. అయితే.. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా.. చాయ్‌పత్తాని కూడా అక్రమార్కులు వదలట్లేదు. ప్రస్తుతం వెలుగు చూసిన ఓ ఘటన.. ఇప్పుడు చాయ్ లవర్స్‌ని భయపెట్టేలా చేస్తోంది.
హైదరాబాద్ నగరంలో టీ పొడిని కల్తీ చేసి అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలో పెద్ద పెద్ద హోటల్స్ నుంచి, చిన్న చిన్న టీస్టాల్స్ వరకు అందరికీ.. ఈ ముఠానే టీ పొడి సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించటం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఫతేనగర్‌లోని కోణార్క్ టీ తయారీ కేంద్రంపై బుధవారం రోజున (అక్టోబర్ 9న) టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీ పొడిలో కొబ్బరి చిప్పల పొడిని కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. కొబ్బరి చిప్పల పొడితో పాటు.. వారిని యాలాకులు, చాక్లెట్ ప్లేవర్లు వచ్చేలా హానికరమైన రసాయనాలతో పాటు రంగులు కూడా కలుపి టీపొడి తయారు చేస్తున్నట్టు తేల్చారు.
ఈ కల్తీ చేసిన చాయ్ పత్తిని నగరంలోని చాలా టీ స్టాల్స్‌కు సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కోణార్క్ టీ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. పెద్దఎత్తున కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 300 కిలోల టీ పొడిని, 200 కిలోల కొబ్బరి చిప్పల పొడిని, 5 కిలోల నాన్ ఫుడ్ గ్రేడ్ ఎరుపు, నారింజ రంగులు, చాక్లెట్, ఏలకులు, పాలు వంటి ఆర్టిఫీషియల్ ప్లేవర్లకు సంబందించి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పదార్థాల శాంపిల్స్ సేకరించి లాబ్స్‌కు పంపించారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కోణార్క్ టీ తయారీ కేంద్ర మీద.. పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలోని టీ వినియోగదారుల భద్రత, శ్రేయస్సు కోసం సెంట్రల్ జోన్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అందించిన సమాచారంతో ఈ దాడి చేసినట్టుగా అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa