హైదరాబాద్ మెట్రో ప్రతి నిత్యం లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం మూడు కాడిడార్లు ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలందిస్తోంది. మెట్రోకు ఆదరణ పెరుగుతుండటంతో రెండో దశను ప్రాతిపాదించారు.
కారిడార్ IVలో భాగంగా నాగోల్ -ఆర్జీఐఏ ఎయిర్ పోర్ట్ వరకు, కారిడార్ వీలో రాయదుర్గం -కోకాపేట్ నియోపోలిస్ వరకు, కారిడార్ VIలో ఎంజీబీఎస్ – చంద్రాయన్ గుట్ట వరకు, కారిడార్ VIIలో మియాపూర్ – పటాన్ చెరు వరకు, కారిడార్ VIIIలో ఎల్ బి నగర్ – హయత్ నగర్ వరకు, కారిడార్ IX ఆర్జీఐఏ – ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు మెట్రో నిర్మిస్తున్నారు.
అయితే మెట్రోరైలు రెండో దశలో ఐదు మార్గాలకు సంబంధించిన డీపీఆర్‌లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. మెుత్తం 76.2 కి.మీ.కు గాను రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఫోర్త్‌సిటీ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు హెచ్‌ఏఎంఎల్ అధికారులు వేర్వేరుగా నివేదికలు సమర్పించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నిర్మించే మెట్రోలో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం భరించే వాటా సాధారణంగా 15 శాతం ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. అయితే మెట్రో రెండోదశలో 18 శాతం వరకు కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర తరపున వాటాగా 30 శాతం, పీపీపీ పెట్టుబడులకు 4 శాతం, మిగిలిన 48 శాతం జైకా వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య ప్రాజెక్టుపై రుణాలకు కేంద్రం పూచీకత్తు ఇస్తుందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే మంత్రివర్గ ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa