ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రా పేరుతో బిల్డర్ల నుండి డబ్బులు వసూలు : ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 08:37 PM

కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్  లో శుక్రవారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడె రాజీవ్ సాగర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దిగజారుతోందని ఆరోపించారు. తెలంగాణలో డబ్బును దోచుకొని ఏఐసీసీకి పంపిస్తోందని, బంగారు బాతులా రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకుంటుందన్నారు. కాంగ్రెస్ దేశంలో ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ నుంచి డబ్బులు పంపిస్తున్నారని, హర్యానా ఎన్నికలకు తెలంగాణ నుండి డబ్బులుపంపించారని, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు వెళ్తున్నాయని అన్నారు. బిల్డర్లను,వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన ఇంటి నుండే కార్యకలాపాలను నడిపిస్తున్నారని, ఇంట్లోనే ప్రాజెక్టుల అంచనాలు తయారు అవుతున్నాయని మండిపడ్డారు. డబ్బులు వచ్చే వాటిపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారని ధ్వజమెత్తారు. హైడ్రా  పేరుతో బిల్డర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సుంకిశాల ప్రాజెక్టు (Sunkisala Project) నిర్మాణంలో నాణ్యతా లోపాలు జరిగితే మెఘా కంపెనీపై (Megha Company) ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ ఏజెన్సీని ఎందుకు ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదని నిలదీశారు.


 


మెఘా క్రిష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసే వరకు రాజకీయ పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసే అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. కులగణన సర్వేపై ఎలాంటి చర్చ లేదని, అవసరం లేని సమాచారం అడుగుతున్నారని ఆరోపించారు. ఉన్న పథకాలు పోతాయని ప్రజలు భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సర్వేపై అనుమానాలు ఉన్నాయన్నారు. 11 నెలల్లో ఒక్క మంచి పనిరేవంత్ రెడ్డి చేయలేదన్నారు. కేసులు పెడతామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని వెల్లడించారు. రాహుల్ గాంధీ.. ఆదానీ(Adani), మోదీని డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Sarkar) అన్నారని, రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీ ద్వారా బీజేపీకి దగ్గర అయ్యారన్నారు. తెలంగాణ భూములు ఆదానీకి కట్టబెడుతున్నాడని మండిపడ్డారు. ఆదానీ ద్వారా తెలంగాణ డబ్బులు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వెళ్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే సోయి మర్చిపోయి మాట్లాడుతున్నాడన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకడంలో మతలబేంటని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa