రేపు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన సంఘటన తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రేపు మల్లు రవి, రామ్మోహన్ రెడ్డితో పాటు వ్యవసాయశాఖ కమిటీ ఛైర్మన్ కొదండరెడ్డి, బెల్లయ్య నాయక్‌లు లగచర్లకు వెళ్లి.. అక్కడి బాధితులతో మాట్లాడనున్నారు.