ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నల్లకుంటలోని హిందీ మహా విద్యాలయం అనుమతులను రద్దు చేసింది. ఈ మేరకు హిందీ మహా విద్యాలయం స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కోర్సు పూర్తి చేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అవకాశం కల్పించింది.విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు ఓయూ విచారణ కమిటీ తేల్చడంతో ఓయూ ఈ నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేటు కాలేజీలో ఓయూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు కూడా విచారణ కమిటీ నిర్ధరించింది. ఈ క్రమంలో ఓయూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa