ఈ నెల 31వ తేదీలోగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వస్తారని భావిస్తున్నానన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన నేతగా సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. మేడ్చల్, రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను త్వరలో విప్పుతామని హెచ్చరించారు.లగచర్ల కేసులో అరెస్టై జైల్లో ఉన్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో బేడీలు వేయడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. అదానీ విషయంలో ఇక వివాదం వద్దని... ఆయన ఇచ్చిన రూ.100 కోట్లను తమ ప్రభుత్వం వెనక్కి ఇచ్చిందని స్పష్టం చేశారు. హాస్టళ్లకు పెండింగ్ బిల్లులను ఈ నెల 31వ తేదీ లోగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.