కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ మౌలానా ఆజాద్ నగర్ బస్తీ దవాఖానను మంగళవారం తనిఖీ చేశారు. వైద్యులు లేక 20 రోజులుగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని, నర్సులు తాత్కాలిక సేవలు అందిస్తున్నారని తనిఖీల్లో కార్పొరేటర్ గుర్తించారు.
వెంటనే డిఎంహెచ్ఓ డా. వెంకటేశ్వర్ కు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేసి వైద్యుడిని నియమించాలన్నారు. మధుమేహం, మలేరియా వ్యాధుల నివారణకు రక్త పరీక్షలు చేసేలా చూడాలని కోరారు.