తలకొండపల్లి మండల కేంద్రంలో మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంఘసంస్కర్త, నాస్తికుడు, ద్రవిడ ఉద్యమ నిర్మాత పెరియర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళిత బహుజనులు ఆయన మార్గాన్ని ఎంచుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుతూ వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేయాలని కోరారు.