వికారాబాద్ జిల్లా మహావీర్ ప్రవేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న మేఘన గుండెపోటుతో మంగళవారం మృతి చెందింది. నిన్న కళాశాలలోనే ఆడుతున్న సమయంలో నేలపై కుప్పకూలిన మేఘన.
హుటాహుటిన తోటి విద్యార్థులు ఆసుపత్రికు తరలించినా ఫలితం దక్కలేదు. తోటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు.