జగిత్యాల జిల్లాలో ఉత్తమ సేవలoధించిన అధికారులు, ఉద్యోగులకు 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రశంషా పత్రాలు అందించారు. పోలీస్ విభాగంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణా రెడ్డి, గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్, జగిత్యాల సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో(డీఎస్పీ) విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాములు, జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్ఎంఓ విజయ్ కుమార్ రెడ్డి, డీ ఆర్ డీ ఏ శాఖలో పనిచేస్తున్న శ్రావణ్ కుమార్,డిపిఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న కనుకయ్య కొండయ్య తో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు,ఉద్యోగులు తదితరులు కలెక్టర్ ప్రశంషా పత్రాలు అందుకున్నారు.
ఉత్తమ సేవలoధించి ప్రశంషా పత్రాలు అందుకున్న అధికారులు, ఉద్యోగులకు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,అదనపు కలెక్టర్లు లత, గౌతమ్ రెడ్డి,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.