ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంల వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం అందించారు. ఏఎన్ఎంలకు పూర్తి వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, హెచ్ఎం, వార్డెన్‌ల వేధింపులను అరికట్టాలని కోరారు. ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa