తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే.. మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. దేవరకొండలో శనివారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి ఈ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లే కాదు ఆ తర్వాత ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళుతున్నారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa