జులై నెలలో 23 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ తెలిపింది. వివిధ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. తప్పుడు సమాచారాన్ని నిరోధించడం, సైబర్ భద్రతను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ పేర్కొంది. భారత చట్టాలు, వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించి ఆ ఖాతాల ద్వారా కొందరు వాట్సాప్‌ను దుర్వినియోగం చేశారని వివరించింది