ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేందుకు 4 అంకెల పిన్ మాత్రమే ఉంటుంది. ఏటీఎంను 1969లో స్కాటిష్ శాస్త్రవేత్త షెపర్డ్ బారన్ కనిపెట్టినప్పుడు 6 అంకెల పిన్ ఉండేది. అయితే పిన్ నంబరు ఎక్కువ మంది మర్చిపోతుండేవారు. దీంతో 4 అంకెలకు కుదించారు. అయితే 6 అంకెలు ఉంటే హ్యాకింగ్ చేసే ఆస్కారం తక్కువ. ఇక ఏటీఎం ఆవిష్కర్త అయిన షెపర్డ్ బారన్ 1925లో భారత్‌లోని మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో జన్మించారు.