ఆగస్టు నెలలో 23.28 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. వీటిలో 10,08,000 వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకముందే, ముందస్తుగా నిషేధించబడ్డాయని వివరించింది. వాట్సాప్ తాజా నివేదిక ప్రకారం 598 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి ఆగస్టు 19న కొన్ని ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది. భారతీయ ఐటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో వాటిని బ్యాన్ చేసినట్లు వివరించింది.