గూగుల్ మీట్ త్వరలో మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఆడియోను టెక్స్ట్ గా మార్చే ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ మీట్ కాల్స్ లో మాట్లాడినప్పుడు రికార్డు చేసిన ఆడియోను టెక్ట్స్‌గా మారుస్తుంది. ఈ టెక్స్ట్ ను గూగుల్ డాక్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వీటిని గూగుల్ డ్రైవ్ నుంచి యాక్సెస్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ సాధారణ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది.