యూజర్లకు ఎయిర్‌టెల్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలలో దశలవారీగా ప్రారంభించినట్లు వెల్లడించింది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా కస్టమర్‌లు తమ ప్రాంతం/స్మార్ట్‌ఫోన్‌లలో 5జీ సేవలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఎయిర్‌టెల్ కస్టమర్‌లు తమ ప్రస్తుత ఎయిర్‌టెల్ 4G సిమ్‌లతోనే 5G ప్లస్‌కి మారవచ్చని వివరించింది.