కష్టకాలంలో చాలామంది లోన్లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈ లోన్లు బ్యాంకర్లు ఇవ్వాలంటే ఆ వ్యక్తి క్రెడిట్ రిపోర్టు బాగా ఉండాలి. దీనిని బ్యాంకర్ల పరిభాషలో సిబిల్ స్కోర్ అంటారు. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. సిబిల్ స్కోర్750 పైన ఉంటే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. మీరు చేసే ఖర్చులు, లోన్లను తిరిగే చెల్లించే విధానం, క్రెడిట్ కార్డుల వినియోగం తదితర అంశాలపై ఈ సిబిల్ స్కోర్ పెరగడం, తరగడం జరుగుతుంది. మీ రాబడి కి అనుగుణంగా ఖర్చులు ఉండాలి. క్రెడిట్ కార్డు తీసుకున్న లోన్లు, బిల్లులు ఆన్‌టైమ్‌లో కట్టేయాలి. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్లు తగ్గించాలి. ఒకే సారి 2,3 లోన్లు తీసుకోకపోవడం ఉత్తమం. www.cibil.com నుంచి సిబిల్ రిపోర్టు పొందవచ్చు.